Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 101 చిత్రంలో ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్?

తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తన 100వ సినిమా కావడంతో రూ.100 కోట్ల భారీ బడ్జెతో ఈ చిత్రాన్ని నిర్మి

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:28 IST)
తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తన 100వ సినిమా కావడంతో రూ.100 కోట్ల భారీ బడ్జెతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వశిష్టాదేవిగా శ్రేయ నటిస్తుంటే, బాలకృష్ణకి తల్లిగా గౌతమి పాత్ర్రలో అలనాటితార హేమమాలిని నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఇదిలావుంటే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే త‌న తదుపరి చిత్రం కోసం బాలయ్య రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాల‌కృష్ణ త‌న 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ''రైతు'' అనే చేస్తున్న‌ట్టు బాలయ్య ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. బుధవారం బాల‌కృష్ణ రామోజీ ఫిలిం సిటీలో రాంగోపాల్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ''సర్కార్-3'' షూటింగ్‌లో పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్‌ను కలిశారు. 
 
ఆ సందర్భంగా బాలయ్య వెంట కృష్ణవంశీ కూడా ఉండటం విశేషం. డిసెంబర్లోనే ''రైతు'' సెట్స్ మీదికి వెళ్తుందని కృష్ణవంశీ నుంచి స్ప‌ష్టం వ‌చ్చింది. అయితే బాలయ్య-కృష్ణవంశీ కలిసి అమితాబ్ బచ్చన్‌ను కలవడానికి ప్రత్యేక కారణం ఉండొచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ 101వ సినిమాలో అతిథి పాత్ర పోషించాలని బాలయ్య.. బిగ్-బిని అడిగాడని కూడా ఒక ప్రచారం మొదలైపోయింది. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments