Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి సినిమాల పోటాపోటీ.. బాలకృష్ణ-చిరు ఒకవైపు.. బావాబావమరుదుల పోరు మరోవైపు?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలు ఎవరంటే చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ పేర్లే వినిపించేవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రధానంగా వీరి చుట్టే తెలుగు సినిమాలు తిరుగుతుండేవి. వీరిలో ఏ ఇద్దరి మ

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (15:23 IST)
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలు ఎవరంటే చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ పేర్లే వినిపించేవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రధానంగా వీరి చుట్టే తెలుగు సినిమాలు తిరుగుతుండేవి. వీరిలో ఏ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు జరిగినా టాలీవుడ్‌లో ఆ కిక్కే వేరుగా ఉండేది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ కథానాయకులు వచ్చారు. వారి మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. 
 
ఇదిలావుంటే... వచ్చే సంక్రాంతికి మాత్రం మళ్లీ ఒకప్పటి తరహాలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ సమరానికి సై అంటుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. చిరు సినిమా - ఖైదీ నెంబర్ 150, బాలయ్య సినిమా - గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదల కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం... అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ సినిమాలు సైతం సంక్రాంతికి విడుదల కానుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
నాగార్జున నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా రిలీజ్ ముందు అనుకున్నది సంక్రాంతికే. కానీ తర్వాత వెనక్కి తగ్గినట్లు కనిపించారు. అయితే ఇటీవల ప్రేమమ్ సక్సెస్ మీట్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అన్నీ కుదిరితే ఓం నమో వెంకటేశాయను సంక్రాంతికి విడుదల చేస్తామని అన్నారు. మరోవైపు వెంకీ చిత్రం గురు రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా ప్రకటన ఏదీ రాలేదు కానీ.. ఆ సినిమా డిసెంబరు కల్లా పూర్తయిపోతుందట. 
 
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమా అయితే సంక్రాంతిలోపు రెడీ అయిపోతుంది. దీంతో ఈ బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఫైటింగ్‌కు తెర‌లేవ‌నుంద‌న్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ బావ‌బావ‌మ‌రుదుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో వేచి చూడాలి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments