Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా పేలిందేమిటి? ఉంచుదామా? తీసేద్దామా? 'రారండోయ్..'పై నాగ్ మల్లగుల్లాలు

పబ్లిసిటీ అనేది అంత తేలిగ్గా రాదు. దానికోసం చాలా కష్టాలు పడాలి. బాహుబలి చిత్రం తర్వాత విడుదలయిన చిన్నాచితకా చిత్రాలు బాహుబలి దెబ్బకు బోర్లాపడ్డాయి. చెప్పాలంటే ఏప్రిల్ 28 నుంచి బాహుబలి హవా సాగుతూనే వుంది. ఈ నేపధ్యంలో దాదాపు నెల రోజులకు నాగచైతన్య చిత్ర

Webdunia
బుధవారం, 24 మే 2017 (15:20 IST)
పబ్లిసిటీ అనేది అంత తేలిగ్గా రాదు. దానికోసం చాలా కష్టాలు పడాలి. బాహుబలి చిత్రం తర్వాత విడుదలయిన చిన్నాచితకా చిత్రాలు బాహుబలి దెబ్బకు బోర్లాపడ్డాయి. చెప్పాలంటే ఏప్రిల్ 28 నుంచి బాహుబలి హవా సాగుతూనే వుంది. ఈ నేపధ్యంలో దాదాపు నెల రోజులకు నాగచైతన్య చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం విడుదల కాబోతోంది. బాహుబలి సునామీని అడ్డుకుని తనదైన వసూళ్లను రాబట్టేందుకు రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం పబ్లిసిటీని ఓ రేంజిలో చేయాల్సింది. 
 
కానీ ఏదో ఓ మోస్తరుగా జరుగుతూ వస్తుండగా ఆడియో వేడుకలో సూపర్ రేంజిలో ఆ సినిమా పబ్లిసిటీ మోతెక్కిపోయింది. అదేమిటంటే... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అనే డైలాగుపై సీనియర్ నటుడు చలపతి రావు...అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ చేసిన కామెంట్ దెబ్బకు పబ్లిసిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఐతే ఆ వ్యాఖ్య నెగిటివ్ కావడంతో మహిళా సంఘాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
చలపతిరావు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసినా వదలిపెట్టేది లేదంటున్నాయి. సినిమాను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున వివాదానికి కారణమైన డైలాగ్... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగును వుంచాలా... లేదంటే తీసేయాలా... అనే దానిపై సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారట. ఉంచుతారో తీసేస్తారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments