Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య చిత్రానికి తప్పని రభస - పవర్ పోటీ!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (13:36 IST)
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక లైలా కోసం. ఈ చిత్రం విడుదల తేదీకి ముందు వెనుకా పోటీ తప్పడం లేదు. 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో చైతుకు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అయితే, ఈ చిత్రాన్ని వచ్చే నెల 5వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అదే రోజున మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం "పవర్‌"ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. 
 
ఈ చిత్ర విడుదల తేదీకి ఒక వారం రోజులు ముందుగా ఉంటే హీరో నాగార్జున పుట్టిన రోజైన ఆగస్టు 29వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేయగా, అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ నటించిన "రభస" చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. దీంతో నాగ చైతన్య 'రభస'తో పోటీ పడుతారా లేక 'పవర్‌'తో ఢీ కొంటారా అనేది తేలాల్సి వుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments