బంగార్రాజు గురించి చైతు ఏమ‌న్నాడో తెలుసా?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (20:56 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఘ‌న విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీ ప్రీక్వెల్‌గా బంగార్రాజు సినిమా చేయనున్న‌ట్టు నాగార్జున ఎప్పుడో ఎనౌన్స్ చేసారు కానీ.. ఎప్పుడు ప్రారంభం అనేది ఇంకా క్లారిటీ లేదు.
 
మ‌న్మ‌థుడు 2 త‌ర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన నాగార్జున ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు సోల్మ‌న్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బంగార్రాజు ఉందా లేదా అనేది స‌మాధానం లేని ప్ర‌శ్నగా మిగిలింది. అయితే.. వెంకీమామ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకు వ‌చ్చిన నాగ చైత‌న్య‌ని బంగార్రాజు గురించి అడిగితే... బంగార్రాజు క‌థ నాన్న‌కు సంతృప్తినివ్వ‌లేదు. 
 
ప్ర‌స్తుతం ఈ క‌థ పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. క‌ళ్యాణ్ కృష్ణ అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇందులో నాన్న‌తో క‌లిసి న‌టిస్తాను. క‌థ అంతా సెట్ అయిన త‌ర్వాత ఈ సినిమా ఎప్పుడు అనేది ఎనౌన్స్ చేస్తాం. ఖ‌చ్చితంగా ఈ సినిమా ఉంటుంది అని నాగ చైతన్య‌ చెప్పారు. క‌ళ్యాణ్ కృష్ణ‌, సీనియ‌ర్ రైట‌ర్ స‌త్యానంద్‌తో క‌లిసి స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నాగార్జున ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి... త్వ‌ర‌లో ఎనౌన్స్‌మెంట్ వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments