Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్ కోసం జల్లెడ... ముమ్మరంగా గాలిస్తున్న టి పోలీసులు

టాలీవుడ్ ఐటెమ్ సాంగ్ హాట్ బాంబ్ ముమైత్ ఖాన్ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:47 IST)
టాలీవుడ్ ఐటెమ్ సాంగ్ హాట్ బాంబ్ ముమైత్ ఖాన్ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె వద్ద విచారణ జరిపేందుకు పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, ముమైత్ ఎక్కడున్నారనే విషయాన్ని మాత్రం వారు కనిపెట్టలేక పోతున్నారట. 
 
నిజానికి వెలుగుచూసిన డ్రగ్స్ దందా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన పాత్రధారి కెల్విన్ ఫోన్‌లోని సమాచారాన్ని అనుసరించి, పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ, ముమైత్ ఖాన్ జాడను మాత్రం ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు. తొలి జాబితాలో ఒక్క ముమైత్‌కు మాత్రమే ఇంకా నోటీసులు జారీ కాలేదని తెలుస్తోంది. 
 
ఆమె చిరునామా విషయంలో స్పష్టత లేదని, హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో ఆమె ఉంటోందని తెలుసుకుని అక్కడికి వెళితే, ఆమె లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ముంబైకి వెళ్లిన వారు కూడా వెనక్కి వచ్చేశారు. 
 
ప్రస్తుతం ముమైత్‌ ఖాన్, పుణెలోని లోనావాలా ప్రాంతంలోని ఓ ఇంటిలో జరుగుతున్న టీవీ షోలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు  అక్కడకు ఒకరిద్దరు కానిస్టేబుల్స్‌ను పంపాలని భావిస్తున్నారు. 
 
అయితే, నిజానికి ముమైత్ ఖాన్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా ఉన్న 'బిగ్ బాస్'షోలో పార్టిసిపెంట్‌గా పాల్గొంటున్నదన్న సంగతి తెలిసిందే. అంటే ఆమె హైదరాబాద్‌లోనే బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా ఓ ఇంటిలోనే 70 రోజుల పాటు గడనుంది. ఈ విషయం తెలంగాణ పోలీసులకు తెలియకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments