Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే ప్రియాంకతో గాఢ ప్రేమలో మునిగిపోయా : ఎంఎస్.ధోనీ

భారత క్రికెట్టు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను ఆధారంగా చేసుకుని 'ఎం.ఎస్.ధోనీ - ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట నీరజ్ పాండే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ధోనీ ఫస్ట్ లవ్ గురించి ఎవరిక

Webdunia
బుధవారం, 13 జులై 2016 (10:09 IST)
భారత క్రికెట్టు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను ఆధారంగా చేసుకుని 'ఎం.ఎస్.ధోనీ - ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట నీరజ్ పాండే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ధోనీ ఫస్ట్ లవ్ గురించి ఎవరికి తెలియని విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

నిజానికి ధోనీ ప్రేమించింది.. పెళ్లి చేసుకుంది ఒక్క అమ్మాయినే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ధోనీ పెళ్లిచేసుకుంది సాక్షినే అయినా.. తన ప్రేమించింది మాత్రం మరొక అమ్మాయిని. అసలు విషయానికొస్తే... భారత జట్టులోకి అడుగుపెట్టక ముందే ధోని రాంచీకి చెందిన ప్రియాంక ఝా అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. 
 
కానీ, దురదృష్టం కొద్దీ, ఓ ప్రమాదంలో ప్రియాంక మరణించింది. అప్పుడప్పుడే క్రికెట్లో ఎదుగుతున్న ధోనిపై ఈ సంఘటన చాలా ప్రభావం చూపిందట. ఈ సంఘటనతో షాక్‌కు గురైన ధోనీ రాంచీలో ఉండలేకపోయాడు. ప్రియాంక మరణించిన ఏడాదిపాటు ఆమెక జ్ఞాపకాలు అతడిని వెంటాడుతూనే ఉన్నాయట. టీమ్ ఇండియాలో చోటు దక్కడంతో ఆ విషాదాన్నిమరిచి ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టాడట. 
 
అదేసమయంలో టీమిండియా నుంచి ధోనీకి పిలుపు రావడంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడని ధోని సినిమా కోసం తన లవ్ స్టోరీని అందరిముందు బయటపెట్టాడు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ రావత్‌ను ధోనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ధోని భార్య సాక్షి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments