Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (11:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఓ సుందరి తళుక్కున మెరిసింది. ఈ సుందరి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఈ మత్తుకళ్ల సుందరి పేరు మోనాలిసా. నల్ల పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఈ యువతి ఫోటో, వీడియోను ఓ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. దీంతో ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీపడుతున్నారు. 
 
అదేసమయంలో ఈ మత్తుకళ్ల మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. ఇప్పటికే ఓ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన తదుపరి చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ఒక వేళ ఆమెకు నటన రాకుంటే శిక్షణ ఇప్పించి నటింపజేస్తానని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కే ఆర్సీ-16లో కూడా మోనాలిసాకు సినిమా అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆర్సీ-16 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ, టాలీవుడ్‌లో మాత్రం మత్తుకళ్ల సుందరికి సినిమా ఛాన్స్ మాత్రం ఖాయమనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments