రోజా హీరోయిన్‌గా తెలుగు సినిమా - దర్శకుడెవరో తెలుసా...?

ఎమ్మెల్యే రోజా. ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేసుకుంటూ అలా ఉండిపోయారు. బుల్లితెరపై మాత్రం రోజాకు తిరుగులేదు. జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందర

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:15 IST)
ఎమ్మెల్యే రోజా. ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేసుకుంటూ అలా ఉండిపోయారు. బుల్లితెరపై మాత్రం రోజాకు తిరుగులేదు. జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. 
 
అయితే రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరిస్తూ ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న రోజా ఈ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపుతోందట. ఆర్.నారాయణమూర్తి గతంలో ఎన్నో సినిమాలను తీశారు. ప్రజా సమస్యలను కళ్ళకు కట్టేలా ఆయన తీసిన సినిమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడే ఇప్పుడు రోజాను హీరోయిన్‌గా చేస్తూ సినిమా తీస్తుండటం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
 
నారాయణమూర్తి ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. సినిమా సాధారణంగా రెండున్నర గంటసేపు ఉంటుంది. కానీ ఈ సినిమా రెండు గంటల నిడివి మాత్రమే ఉంటుంది. కొంతమంది రాజకీయ నేతలను ఈ సినిమాల్లో నటించాలని నారాయణమూర్తే స్వయంగా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండా కల్వకుంట్ల కవిత రాజకీయ యాత్ర?

దుర్గాపూర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం : బాధితురాలి స్నేహితుడు అరెస్టు

గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments