Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లోకి మంత్రి మల్లారెడ్డి.. పవన్‌తో ఆ ఆఫర్.. చిరంజీవితో తొలిసినిమా!

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (13:16 IST)
Malla Reddy
తెలంగాణ రాజకీయ వర్గాల్లో మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. సీరియస్ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడి నవ్వించే వ్యక్తి. పంచ్ డైలాగులతో ప్రజలనే కాదు రాజకీయ నాయకులను కూడా ఆకట్టుకుంటున్నారు మల్లా రెడ్డి. 
 
"నేను పాలు అమ్ముకున్నాను, పువ్వులు అమ్మాను, బోరు బావి వేసాను, కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను.." అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
 
తాజా సమాచారం ఏంటంటే.. మంత్రి మల్లా రెడ్డి సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఏడాదిలోపు నాలుగు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 
 
తెలుగు చలనచిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగిన సమయంలోనే మల్లా రెడ్డి సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఓటీటీకి ఆదరణ పెరిగిందన్నారు. ఓటీటీ కంపెనీని కూడా ప్రారంభించి సినిమాలు తీయనున్నారు. 
 
తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని చెప్పారు. అప్పుడొకసారి పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు విలన్ రోల్ ఆఫర్ వచ్చిందని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments