మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు, చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాలో శరత్ సక్సేనా విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. రాజకీయ ఉద్దండుడు పాత్రను ఆయన పోషిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. గత రెండురోజులుగా హైదరాబాద్ శివార్లో ఓ ప్రైవేట్ భవంతిలో లావిష్ గా చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో కలెక్టర్లు, ఐ.ఎ.ఎస్. అధికారులు, రాజకీయ నాయకులు అంతా ఆనందోత్సవాలతో ఫంక్షన్ జరుగుతుందట.
ఆ సన్నివేశపరంగా మెగాస్టార్ ఓ అద్భుతమైన పాటను ఆలపిస్తారట. ఇది ఐటెం సాంగ్ కాదు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే సాంగ్ అట. అయితే ఆ సాంగ్ చిత్రీకరణ చేశాక ఔట్ పుట్ చూశాక చిరంజీవికి నచ్చలేదట. వెంటనే ఈ సాంగ్ ను డిలీట్ చేయండని సూచించి షూటింగ్ కు ప్యాకప్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ కొంత గేప్ తీసుకుని మరోసారి చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మీసాల పిల్ల.. హిట్‌గా దూసుకెళ్తోంది. ఇంకా ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలు వుండబోతున్నాయి. గ్యాంగ్ లీడర్ తరహాలో వున్నట్లు తన ఆహార్యాన్ని మార్చుకునేలా దర్శకుడు అనిల్ రావిపూడి చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.