Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీ ఒక్క చాన్స్ ప్లీజ్..! మామయ్యా నేను కూడా..!! పెద్దనాన నాక్కూడా..!!! మెగా అవకాశం

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (21:36 IST)
నాన్నా... నీవు నటించే మైలురాయిలాంటి సినిమాలో నాకు ఓ అవకాశం ఇప్పించవా... మావయ్యా నాక్కూడా.. పెద్దనాన్న నేను కూడా.. ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన కుర్ర హీరోలందరూ చిరంజీవి 150వ సినిమా కోసం అర్రులు చాస్తున్నారు. ఆ సినిమాలో ఒక్క నిమిషం కనిపిస్తే చాలని ఉర్రూతలూగుతున్నారు. వారందిరికీ ఎక్కడ అవకాశం కల్పించాలో తెలియక చిరంజీవి తల పట్టుకుంటున్నాడట. వివరాలిలా ఉన్నాయి. 
 
చిరంజీవి 150వ సినిమాలో ఒక చిన్న పాత్రలో అయినా కనిపిస్తే చాలని రామ్ చరణ్ తేజ్ ఆసక్తి కనబరుచుతున్నాడు. అల్లు అర్జున్ కూడా జత కలవడంతో చరణ్ బన్నీలకు వారి స్థాయికి తగ్గట్టుగా చిన్నచిన్న అతిథి పాత్రలు కల్పిస్తే చాలని భావిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ జాబితాలోకి మెగా కుటుంబ యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా చేరిపోయారట. తమకు కూడా ఒక్క నిముషం అయినా చిరంజీవితో నటించే అవకాశం ఇమ్మని స్వయంగా వీరంతా చిరంజీవినే అడుగుతున్నారట. 
 
అనుకోని పరిణామానికి ఆశ్చర్య పడిన చిరంజజీవి ఇంతమందిని తన 150వ సినిమాలో ఎలా ఇరికించేది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది ఒక పవన్ కళ్యాణ్ కదా.. ఆయన లేకుండా మెగా అభిమానులాకు తప్పుడు సంకేతాలను అందచేస్తుందని చిరంజీవి వ్యక్తిగతంగా భావిస్తున్నాడని కొందరి అభిప్రాయం. 
 
ఈ విషయంలో పవన్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని పవన్ కు కూడ తన సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను చేస్తాను అంటే ఒక పాత్రను క్రియేట్ చేస్తే బాగుంటుందని కొందరు సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఈ మేరకు చిరంజీవి పవన్ వద్దకు రాయబారాలు చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తోంది. అది కుదరక పోతే మెగా కుటుంబ హీరోల ప్రత్యేక పాత్రలు లేకుండానే  తన 150వ సినిమాను పూర్తి చేయవచ్చు. 

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments