Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీఎంట్రీకి సిద్ధమవుతున్న మలయాళ కుట్టి!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:52 IST)
మీరా జాస్మిన్... ఒకపుడు తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.  'అమ్మాయి బాగుంది' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ వెంటనే పవన్ జోడీగా 'గుడుంబా శంకర్' సినిమాలో సందడి చేసింది. అందం .. అభినయం కలగలిసిన నాయికగా మంచి మార్కులు కొట్టేసింది. బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ సరసన కూడా ఆడిపాడింది.
 
అయితే, తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలను ఎక్కువగా చేసిన మీరా జాస్మిన్, వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ తర్వాత ఒక మలయాళ సినిమాలో గెస్టు రోల్ చేసిన ఆమె, ఇక పూర్తి స్థాయిలో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. 
 
ఆ తర్వాత ఆమె అంగీకరించిన చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించనున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇక ఆమె తన స్థాయికి తగిన పాత్రలు చేయడానికి సిద్ధమనే సంకేతాలను టాలీవుడ్‌కి కూడా పంపుతోందట. స్నేహ .. భూమిక .. మీనా సరసన మీరా జాస్మిన్ కూడా చేరనుందన్న మాట.
 
సాధారణంగా నిన్నటితరం హీరోయిన్లు పెళ్లి చేసుకున్న కొంతగ్యాప్ తీసుకుని, మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అక్క .. వదిన .. అమ్మ ఇలా ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సంసిద్ధులైపోతున్నారు. అలా రీ ఎంట్రీ ఇచ్చినవారి జాబితాలో తాజాగా 'మీరా జాస్మిన్' చేరిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments