Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్చుగల్‌లో రోడ్డు పక్కన పడుకున్న బాలయ్య... ఎంత సింప్లిసిటీ!

సాధారణంగా సినీ స్టార్స్‌కు లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నిర్మాత విధిగా సమకూర్చాల్సి ఉంటుంది. అలా ఉంటేనే ఆ చిత్ర షూటింగ్ కూడా సజావుగా సాగుతుంది. ఏమాత్రం తేడా వచ్చిన షూటింగ్‌లో

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (14:39 IST)
సాధారణంగా సినీ స్టార్స్‌కు లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నిర్మాత విధిగా సమకూర్చాల్సి ఉంటుంది. అలా ఉంటేనే ఆ చిత్ర షూటింగ్ కూడా సజావుగా సాగుతుంది. ఏమాత్రం తేడా వచ్చిన షూటింగ్‌లో అవాంతరాలు చోటుచేసుకుంటాయి. 
 
అయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు ఈ లగ్జరీ సౌకర్యాలకు ఆమడదూరంలో ఉంటూ నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తూ, ఎండైనా, ఏమైనా రోడ్డు మీద చెట్ల కిందే కూర్చొని, షూటింగులు చేసిన సంగతులు కథలు, కథలుగా విన్నాం.
 
ఇపుడు నందమూరి వారసుడు బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్‌కు ఏమాత్రం తీసిపోకుండా నడుచుకుంటున్నారు. తాజాగా పోర్చుగల్‌లో షూటింగ్‌లో... అంతే ప్రశాంతంగా పచ్చిక బయలులో పడుకొని, హీరో అనే ఆభిజాత్యం లేకుండా పని చేసిన బాలకృష్ణను చూసి చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోయి, కథలు కథలుగా చెబుతోంది.
 
గమ్మత్తేమిటంటే, హైదరాబాద్‌లో షూటింగప్పుడు కూడా బాలకృష్ణ మేకప్‌ చేసుకోవడానికి తప్ప, క్యారవాన్ పెద్దగా ఉపయోగించరు. చాలామందిలా షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో దానిలోకి దూరిపోయి విశ్రాంతి తీసుకోవడం ఉండదు. బయట ఎండలోనే యూనిట్‌ అందరితో పాటు ఉంటూ, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ణీ, ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామినీ స్మరిస్తూ కూర్చుంటారు. దటీజ్ నందమూరి బాలకృష్ణ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments