Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరక్టర్ సుందర్ సి హై బడ్జెట్ ఆఫర్‌ను వదులుకున్న ప్రిన్స్ మహేష్ బాబు...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:08 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది. ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు తమిళనాట కూడా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. 
 
అయితే ఈ రెండు సినిమాల తమిళ వర్షన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్తో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మాత్రం తమిళ వర్షన్కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట. చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రిన్స్ తమిళంలో బాగా మాట్లాడగలడు. అందుకే మహేష్ సొంత గొంతుతో డబ్బింగ్ చెపితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మహేష్ కెరీర్లోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం మహేష్ రూ.30 కోట్ల పారితోషికాన్ని వదులుకున్నాడు.
 
అసలు విషయం ఏంటంటే... తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలనీ భావిస్తున్నాడట. ఆ సినిమాలో మహేష్ నటించేందుకు రూ.30 కోట్ల వరకు పారితోషికం ఇస్తానని అన్నారట. రెమ్యునరేషన్ భారీగా ఉన్నా కూడా మహేష్ కుదరదని చెప్పేశాడట. మహేష్‌తో పాటు తమిళ హీరో జయం రవిని కూడా ఈ సినిమాలో పెట్టి మల్టీస్టారర్‌గా ప్లాన్ చేశాడట సుందర్ సి. కానీ మహేష్ కాదనడంతో వెనక్కి తగ్గారు. మహేష్ కాదన్నాడు కాబట్టి మరో తెలుగు హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తానికి అలా ఓ భారీ ఆఫర్‌ను మహేష్ వదులుకోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments