Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత అక్కినేని పాత్ర‌లో.. నాగ‌చైత‌న్య‌..!

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌రరావు పాత్ర‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌బోతున్నాడు. ఇంత‌కీ విషయం ఏమిటంటే... అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో మ‌హాన‌టి సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న మ‌హాన‌టి

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (18:58 IST)
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌రరావు పాత్ర‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌బోతున్నాడు. ఇంత‌కీ విషయం ఏమిటంటే... అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో మ‌హాన‌టి సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న మ‌హాన‌టి చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ పాత్ర‌ల‌ను తార‌క్, చైత‌న్య‌ల‌తో చేయించాల‌ని వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నిస్తున్నారు.
 
ఒక‌నొక టైమ్‌లో తార‌క్, చైతు ఇద్ద‌రు మ‌హాన‌టిలో న‌టిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ... ఆ త‌ర్వాత న‌టించ‌డం లేద‌ని తెలిసింది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... చైత‌న్య మ‌హాన‌టిలో తాత అక్కినేని పాత్ర పోషించ‌డానికి ఓకే చెప్పార‌ట‌. ఈ నెల 14, 15 తేదీల్లో చైత‌న్యపై ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. 
 
ఈ నెల 21 షూటింగ్ మొత్తం పూర్తి చేయ‌నున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌ను మాత్రం డిజిట‌ల్‌లోనే చూపించ‌నున్నార‌ట‌. తెలుగు, త‌మిళ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని స్వప్న ద‌త్, ప్రియాంక దత్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ నుంచి మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకుంది. మ‌రి... మ‌హాన‌టి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments