Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆదిపురుష్" చిత్రంలో 'సీత'గా "మహానటి" (video)

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (09:34 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న చిత్రం ఆదిపురుష్. రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేయనున్నాడు. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రం పురాణ కథ ఆధారంగా రూపొందుతుందని అంటున్నారు. విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి సాంఘిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. అంటే సోషియో ఫాంటసీగా కూడా వుండే అవకాశాలు వున్నాయని చెప్పచ్చు. 
 
ఇక ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రకు కీర్తి సురేశ్‌ని చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. మహానటి చిత్రంలో ఈమె తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలోనే తెలుస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments