Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్‌' ‍పై లాక్డౌన్ ఎఫెక్టు... హైదరాబాద్‌కు షిప్ట్!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:58 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. యంగ్ దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న రాధేశ్యామ్ జూలైలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. 
 
అధికారకంగా జూలై 30న విడుదల ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసుకున్నారు. ఈ మేరకు అధికారకంగానూ విడుదల తేదీని ప్రకటించారు. కానీ చెప్పిన సమయానికి ఈ సినిమా రిలీజవుతుందా.. అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం మహారాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ముంబై - మహారాష్ట్రలో విస్తృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏకంగా మహారాష్ట్రలో లాక్డౌన్ కూడా విధించారు. ఈ క్రాణంగానే ప్రస్తుతం ముంబైలో పూర్తి కావాల్సిన రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కరోనా మహమ్మారీ వల్ల బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.
 
వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముంబైలో తలెత్తిన తాజా పరిస్థితుల దృష్ట్యా వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడు ముంబై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే రాధేశ్యామ్ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టమని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments