Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ బాబుతో రానా సినిమా.. తండ్రులతో డేంజర్ గురూ.. నువ్వు జాగ్రత్తగా ఉండంటూ కేటీఆర్ ట్వీట్

రానా ద‌గ్గుబాటి హీరోగా ''నువ్వు నేను, ''జ‌యం'' వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్ర

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (11:11 IST)
రానా ద‌గ్గుబాటి హీరోగా ''నువ్వు నేను, ''జ‌యం'' వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రంలో భ‌ల్లాల‌దేవుడుగా మెప్పించిన రానా సెల‌క్టివ్‌గా సినిమాల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 
 
తేజ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తానని దర్శకుడు తేజ అన్నారు. అయితే త్వరలో తేజ డైరక్షన్లో రానా హీరోగా చేయబోయే సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. స్వయంగా రానా తండ్రి సురేష్ బాబు ఆ సినిమాను తీస్తున్నారు. అంటే తొలిసారిగా రానా తండ్రి ప్రొడక్షన్లో చేస్తున్నాడనమాట. అందుకే సురేష్ బాబుతో కలసి ఒక సెల్ఫీ దిగిన రానా.. ''ఈ ప్రొడ్యూసర్ గారితో మొదటిసారి పనిచేస్తున్నాను. 
 
ఆయన నాకు నాన్నవరుస అవుతారు.. త్వరలోనే ప్రాజెక్టు వివరాలు చెబుతాను'' అంటూ సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు.దానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే స్పందించారు. ''చిన్న సలహా అనుకో.. హెచ్చరిక అనుకో.. తండ్రులు అందరూ చాలా టఫ్ బాసులే. నువ్వు జాగ్రత్తగా ఉండు'' అంటూ చమత్కరించారు. వెంటనే స్పందించిన రానా కూడా.. ''అలాగే సార్.. ఒప్పుకుంటున్నాను. అర్ధమైంది. ఫాలో అవుతాను'' అంటూ సమాధానం ఇచ్చాడు.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments