Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమా.. లవ్‌బర్డ్సా.. మాకే తెలియజేసినందుకు థ్యాంక్స్: పగలబడి నవ్వుకుంటున్న ఆ జంట

ధోనీ సినిమాతో ఒక్కసారిగా తారాపథాన్ని అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృతి సనన్‌లను చూసి వాళ్లిద్దరి బంధం దృఢమైనది అనే అందరూ అనుకున్నారు. ఇద్దరూ డేటింగ్

Webdunia
మంగళవారం, 23 మే 2017 (02:00 IST)
ధోనీ సినిమాతో ఒక్కసారిగా తారాపథాన్ని అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృతి సనన్‌లను చూసి వాళ్లిద్దరి బంధం దృఢమైనది అనే అందరూ అనుకున్నారు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వెంటనే పుట్టుకొచ్చేశాయి. రాబ్తా షూటింగ్ సమయంలో ఇది మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కవుట్ అవుతోందో అందరికీ అర్థమైంది. అప్పటినుంచి తెగ చక్కర్లు కొడుతోంది. సరిగ్గా అదే సమయానికి సుశాంత్ తన ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ అంకితా లోఖండేతో బ్రేకప్ కావడంతో కృతితో జంట కుదిరినట్లేనని అంతా భావించారు.
 
 
కానీ.. ఇప్పుడు మాత్రం అదేమీ లేదని సుశాంత్ కొట్టిపారేస్తున్నాడు. తామిద్దరం కేవలం 'మంచి స్నేహితులు' మాత్రమేనని, అంతకంటే మరేమీ లేదని చెబుతున్నాడు. ''మేమా.. లవ్‌బర్డ్సా.. నాకు తెలియజేసినందుకు థ్యాంక్స్'' అంటూ నవ్వేశాడు. అయితే బుడాపెస్ట్‌లో రాబ్తా సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన వాళ్లిద్దరి ఫొటోలు చూస్తే మాత్రం అది కేవలం స్నేహం మాత్రమే కాదని అంతా అన్నారు.
 
అంతకుముందు అంకితతో బ్రేకప్ అయినప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును డిలిట్ చేసిన సుశాంత్, ఆ తర్వాత కృతి సనన్‌తో కలిసి తీయించుకున్న ఫొటోతో మళ్లీ అందులోకి వచ్చాడు. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. షాట్ గ్యాప్‌లో కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి.  
 
తామిద్దరి గురించి ఇలా మీడియాలోను, సోషల్ మీడియాలోను తెగ ప్రచారం జరగడంతో కృతి సనన్‌కు కూడా కోపం వచ్చింది. ఇప్పటివరకు చెప్పింది చాలని, తామిద్దరికీ సహ నటులుగా ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదని, అవన్నీ నిరాధార వదంతులేనని కృతి చెప్పింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments