Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మెగాస్టార్‌కు డైరెక్టర్‌కు మధ్య మనస్సర్థలు వచ్చాయట... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (19:30 IST)
మిర్చి నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడా సెంటిమెంట్‌కు చిరంజీవి బ్రేక్ వేస్తున్నాడట. భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల శివ. కొరటాల సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే.
 
కొరాటాల తీసిన ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీనే. అయితే చిరంజీవి సినిమాకు అమిథ్ త్రివేది మ్యూజిక్ ఇస్తాడన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే కొరటాల సెంటిమెంట్‌కు బ్రేక్ పడినట్లే. బాలీవుడ్ సినిమా సైరాతో ఎంట్రీ ఇచ్చారు అమిథ్ త్రివేది. యేడాది ప్రయాణంలో అమిథ్ వర్కుకు చిరంజీవి బాగా ఇంప్రెస్ అయ్యారట. 
 
కొరటాల మూవీలో కూడా ఈ సంగీత దర్సకుడినే హీరోగా తీసుకోవాలని దర్సకుడు భావిస్తున్నారట. కొరటాల.. దేవీశ్రీనే కాదు చిరంజీవి.. దేవిశ్రీలది కూడా హిట్ కాంబినేషనే. ఈ ఇద్దరు కలయికలో నాలుగు సినిమాలు వస్తే రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఖైదీ నెంబర్ 150, శంకర్ దాదా ఎంబి.బి.ఎస్ సినిమాలో దేవిశ్రీదికీ రోల్. మ్యూజిక్ పరంగా భారీ హిట్టిచ్చిన వారిని పక్కన బెట్టి చిరంజీవి అమిథ్‌ను తీసుకోమనడంపై ఏం చేయాలో అర్థం కాక డైరెక్టర్ కొరటాల శివ ఆలోచనలో పడిపోయారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments