Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ వెనకాల ఉంటే ఓ శక్తి అండగా ఉన్నట్టు ఉంటుంది.. కోన వెంకట్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నంబర్ వన్ పొజిషన్లో ఉన్న కోన వెంకట్ త్వరలో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు. కోన ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:15 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నంబర్ వన్ పొజిషన్లో ఉన్న కోన వెంకట్ త్వరలో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు. కోన ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్‌లో కూడా కథలు, కథనాలు అందిస్తున్నారు. 
 
కాగా తాజాగా అందిన సమాచారం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, కోన వెంకట్ దర్శకుడిగా త్వరలోనే ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరికి ఎప్పటినుంచో మంచి స్నేహం వుంది. ఈ స్నేహం గురించి మరోసారి ప్రస్తావించారు కోన. 
 
ఇటీవల కోన సమర్పణలో వచ్చిన చిత్రం ''అభినేత్రి''. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన వెంకట్ కళ్యాణ్‌తో తనకున్న స్నేహం గురించి ప్రస్తావించాడు. ''నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ముందుగా పవన్ కల్యాణ్‌కు చెప్పుకుంటా. పవన్ నా సమస్య అంతా విన్న తర్వాత.. ఒకేఒక మాటతో సమస్యకు పరిష్కారం చెప్పేస్తారు. 
 
ఆయనతో ఉంటే మన వెనకాల ఒక శక్తి ఉంది.. అంతా అది చూసుకుంటుంది'' అని భావాన కలుగుతుంది. అలాగే, కల్యాణ్తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ, నేను ప్రతిసారి కొంత స్క్రిప్ట్ రాసుకోవడం.. కొన్ని రోజుల తర్వాత దాన్ని చించేయడం జరుగుతోంది. ఎందుకంటే, స్క్రిప్ట్ రాసేటప్పుడు పవన్‌ను ఒక స్థాయిలో ఊహించుకుని కథ రాయడం మొదలు పెడతాను. స్క్రిప్ట్ కొద్దిగా పూర్తయ్యే సరికి, పవన్ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. దీంతో, రాసిన స్క్రిప్ట్‌‌ను చించేసి... మళ్లీ కొత్తది మొదలుపెట్టడం జరుగుతోంది'' అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments