Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్‌ కర్దాషియన్‌ను బాత్రూంలోకి తీసికెళ్లి ఆ తర్వాత ఆమెను దుండగులు....

సెలబ్రిటీలు ఏది చెప్పినా వార్తే. ఏది విప్పినా అద్భుతమే. కిమ్‌ కర్దాషియన్‌ ఓ అందాలతార. కిమ్‌ ఓ నటి, టెలివిజన్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటి, ప్రముఖ మోడల్‌, సోషలైట్‌, సోషల్‌మీడియా పర్సనాలిటీ. ఇన్ని రంగాల్లో ర

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (15:36 IST)
సెలబ్రిటీలు ఏది చెప్పినా వార్తే. ఏది విప్పినా అద్భుతమే. కిమ్‌ కర్దాషియన్‌ ఓ అందాలతార. కిమ్‌ ఓ నటి, టెలివిజన్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటి, ప్రముఖ మోడల్‌, సోషలైట్‌, సోషల్‌మీడియా పర్సనాలిటీ. ఇన్ని రంగాల్లో రాణిస్తున్న కిమ్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఆమె ప్యారిస్‌లోని హోటల్‌లో బస చేసింది. అదేసమయంలో పోలీసు దుస్తులు ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెకు తుపాకులు చూపి బెదిరించారు. ఆ తర్వాత ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి రెండు చేతులు కట్టేసి గడియపెట్టి దోపిడీకి పాల్పడినట్లు చెపుతున్నారు.
 
దుండగులు తుపాకీతో బెదిరించడంతో ఆమె వణికిపోయిందని కిమ్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ వెల్లడించారు. అయితే ఆమెకు ఎటువంటి హాని చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిమ్ కర్దాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా, లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఆమె భర్త కాన్ యె వెస్ట్, న్యూయార్క్‌లోని సిటీ ఫీల్డ్‌లో తాను పాల్గొంటున్న మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రదర్శనను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు. తన కుటుంబ సమస్య కారణంగా షో నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments