Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 గూగుల్ క్వీన్‌గా అవతరించిన కియారా అద్వానీ!

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (15:10 IST)
2023 పూర్తవుతుంది. ఈ ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగం, ప్రపంచకప్, ఆస్కార్ అవార్డులు, ప్రముఖుల వివాహాలు తదితర అరుదైన కార్యక్రమాలు జరిగాయి. దీంతో నెటిజన్లు ఈ ఏడాది గూగుల్‌లో వీటి కోసం వెతుకుతున్నారు. 
 
ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారంటే.. ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇండియా వైడ్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో కియారా అద్వానీ మొదటి స్థానంలో ఉంటే, భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర, భారత ఆటగాడు మహమ్మద్ షమీ, ప్రముఖ యూట్యూబర్ ఎల్విస్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
 
ఈ లిస్ట్‌లో కియారా మొదటి స్థానంలో నిలిస్తే, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆరో స్థానంలో నిలిచారు. సిద్ధార్థ్ కూడా బాలీవుడ్ హీరో అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ 2021లో ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 
 
పెళ్లి వరకు రహస్య సంబంధాన్ని కొనసాగించిన వారిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏడడుగులు వేశారు. రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా లైక్ చేసిన వెడ్డింగ్ పిక్స్‌గా రికార్డు సృష్టించాయి.
 
కియారా అద్వానీ భారతీయ గూగుల్ సెర్చ్‌లోనే కాదు. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్‌లో కూడా స్థానం సంపాదించింది. గ్లోబల్ వైడ్ గూగుల్ సెర్చ్‌ల టాప్ 10 జాబితాలో కియారా 9వ స్థానంలో ఉంది. గ్లోబల్ టాప్ సెర్చ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా కియారా అద్వానీనే. కియారా అద్వానీ ఈ ఏడాది గూగుల్ క్వీన్‌గా అవతరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments