Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ నం.150" అమ్మడు... కుమ్ముడు సాంగ్... "జనతా గ్యారేజ్" పక్కాలోకల్‌కు జిరాక్స్ కాపీనా? (Video)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇది ఆయన 150వ చిత్రం కూడా. కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, వీవీవినాయక్ దర్శకుడు. చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (09:40 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇది ఆయన 150వ చిత్రం కూడా. కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, వీవీవినాయక్ దర్శకుడు. చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
అయితే, ఈ చిత్రం ఆడియోను విడుదల చేయకుండా కేవలం ఒక్క పాట ఆడియోను మాత్రం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. "అమ్మడు లెట్స్ డు కుమ్ముడు" పేరుతో సాగే ఈ పక్కా మాస్ సాంగ్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం (25వ తేది) ఉదయం 9 గంటలకు మొత్తం 5,424,523 మంది నెటిజన్లు ఈ ఆడియోను వీక్షించారు. ఇది మెగా కాంపౌండ్‌ను మరింత సంతోషంలో ముంచెత్తింది. 
 
ఈనేపథ్యంలో ఈ పాటకు సంబంధించి తాజాగా ఓ ప్రచారం ఫిల్మ్ నగర్‌తో పాటు.. సోషల్ మీడియాలో సాగుతోంది. ఇది మెగా కాంపౌడ్‌తో పాటు.. చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వార్త ఏంటంటే... 'అమ్మడు' పాట జూనియర్ బ్లాక్ బస్టర్ హిట్ "జనతా గ్యారేజ్"లోని 'పక్కాలోకల్' పాటకు జిరాక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
అంతేకాదండోయ్... 'పక్కా లోకల్', 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పాటల ఆడియో క్లిపింగ్స్‌ను పక్కపక్కన వినిపిస్తూ 'అమ్మడు' పాటను దేవిశ్రీ ప్రసాద్ తన 'పక్కా లోకల్' సాంగ్ ట్యూన్ నుంచి కాపీ కొట్టి బాణీలు సమకూర్చాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
అయితే ఇది అంతా 'ఖైదీ' సినిమాలోని 'అమ్మడు' పాటకు వస్తున్న క్రేజ్‌ను చూసి తట్టుకోలేక ఈర్ష్యతో కొందరు చేస్తున్న దుష్ప్రచారం అంటూ మెగా అభిమానులు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. మొత్తంమీద చిత్రం విడుదలైతే గానీ నిజానిజాలు వెల్లడవుతాయి. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments