Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా? బద్ధలైన బాహుబలి రికార్డు

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలో రాజమౌళి నిర్మించిన "బాహుబలి"తో పాటు... అమీర్ ఖాన్ "పీకే" చిత్రం వసూళ్లను బ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (14:36 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలో రాజమౌళి నిర్మించిన "బాహుబలి"తో పాటు... అమీర్ ఖాన్ "పీకే" చిత్రం వసూళ్లను బీట్ చేసిన విషయం తెల్సిందే. ఒక్క అమెరికాలోనే ప్రీమియర్ షోల ద్వారా రూ. 8.56 కోట్లు వసూలు చేసింది. 
 
ఇకపోతే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఏకంగా రూ.15 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. వసూళ్ల విషయంలో ఫస్ట్ డే కొన్ని ఏరియాల్లో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినట్టు వార్తలొచ్చాయి. ప్రీమియర్, బెనిఫిట్ షోలతో కలిసి రూ.39 కోట్లు రాబట్టినట్టు ఫిల్మ్ మేకర్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం. ఒక్క అమెరికాలోనే ప్రీమియర్ షోల ద్వారా రూ.8.56 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
 
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో క‌లిపి ఒక్క రోజులోనే 39 కోట్ల రూపాయ‌ల‌కు పైగా కలెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. రాజ‌మౌళి సూప‌ర్ హిట్ మూవీ "బాహుబ‌లి"కి ది బిగినింగ్‌కి మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు రూ.35 కోట్లు సాధించింద‌ని ఇప్పుడు ఆ రికార్డును చిరు మూవీ బ‌ద్ధ‌లు కొట్టింద‌ని చెబుతున్నారు. దీంతో చిరు తెలుగు చిత్రానికి కొత్త టార్గెట్ ఇచ్చాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చిరు సెట్ చేసిన ఈ రికార్డుని బాహుబ‌లి-2 బ‌ద్దలు కొడుతుంద‌ని కొంద‌రు అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

అయితే, గల్ఫ్ విషయానికొస్తే.. దుబాయ్, ఒమన్, మస్కట్, కువైట్, సౌదీ అరేబియాలోనూ ముందుగానే టిక్కెట్లు అమ్ముడు పోవడంతో ఐదుకోట్లు రావచ్చుని ఓ అంచనా! ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 15 కోట్లు వచ్చినట్టు ఇన్‌సైడ్ సమాచారం. అయితే, రెండో రోజైన జనవరి 12వ తేదీన ఇదే స్పీడ్ కొనసాగడం కష్టం. ఎందుకంటే బాలకృష్ణ శాతకర్ణి రావడంతో రెండోరోజు ఖైదీ వసూళ్లు తగ్గవచ్చని, కానీ వీకెండ్‌లో మళ్లీ వసూళ్లు పుంజుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments