Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి' మరో 'సావిత్రి'కానుందా? నిర్మాతగా కీర్తి సురేష్?? (Video)

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (11:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మహానటిగా గుర్తింపు పొందిన అలనాటి మేటి హీరోయిన్ సావిత్రి. ఈమె హీరోయిన్‌గా నటిస్తూనే పలు చిత్రాలను స్వయంగా నిర్మించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో తాను సంపాదించిన ఆస్తిపాస్తులన్నింటినీ తెగనమ్మేసి, చివరకు అష్టకష్టాలు పడ్డారని సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఇదే విషయాన్ని మహానటి చిత్రంలో కూడా చూపించారు. 
 
అయితే, ఇపుడు తెలుగులో మహానటిగా గుర్తింపు పొందన మలయాళ భామ కీర్తి సురేష్. ఈమె సావిత్రి బయోపిక్‌లో అద్భుతంగా నటించడంతో ఆమెకు మహానటి అని ముద్రపడిపోయింది. ఈ ఒక్క చిత్రంతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 
 
మహానటి మూవీ తర్వాత కీర్తిసురేశ్‌కు వెనక్కి తిరిగి చూసుకునే అవ‌కాశం రాలేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ అంద‌రినీ అల‌రిస్తోన్న ఈ బ్యూటీ ఇటీవ‌లే పెంగ్విన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వ‌చ్చింది. 
 
అంతేకాదు ప్ర‌స్తుతం తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి "అన్నాత్త" చిత్రంతోపాటు మ‌హేశ్ బాబు నటిస్తోన్న "సర్కారు వారి పాట‌"లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రికొన్ని ప్రాజెక్టుల‌ను కూడా లైన్‌లో పెట్టింది. 
 
ఇదిలావుంటే, కీర్తిసురేశ్ త‌న ఫాలోవ‌ర్లు, అభిమానుల‌కు సర్ ప్రైజ్ కానుక‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ భామ నిర్మాత‌గా మార‌నుంద‌న్ వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌మిళంలో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించేందుకు కీర్తిసురేశ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. కీర్తి సురేశ్ ఎలాంటి క‌థ‌తో అభిమానుల‌ను అల‌రిస్తుందో చూడాలి మ‌రి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments