Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడు' కుమ్మేశాడు... ఓవర్సీస్ హక్కుల్లో సరికొత్త రికార్డు

హీరో పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల మందుక

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (17:16 IST)
హీరో పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది. 
 
తమిళ హిట్ మూవీ 'వీరమ్' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్, పోస్టర్స్... అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ అయితే యూట్యూబ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో సినిమా ఓవర్సీస్ హక్కులను కొనేందుకు భారీగానే పోటీ ఏర్పడింది. 
 
ఫలితంగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ముఖ్యంగా.. ఏకంగా ఈ ఓవర్సీస్ రైట్స్ రూ.11.5 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. పవన్, శ్రుతిహాసన్ కలయికలో గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 
 
కాగా ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్లను ఈ సినిమా కలెక్ట్ చేస్తేనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడతారు. పవన్‌కు ఓవర్సీస్‌లో భారీగానే మార్కెట్ ఉంది. ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం 1.90 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయగా.. 'సర్దార్ గబ్బర్ సింగ్' కూడా మిలియన్ డాలర్లు మార్కును దాటేసింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments