Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ బయోపిక్.. యాత్రలో ''జగన్‌" రోల్‌ ఆ హీరోకు ఇచ్చేశారట..?

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జన

Webdunia
బుధవారం, 25 జులై 2018 (16:08 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఖరారు చేశారు. మహి వి. రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. రీల్‌ లైఫ్‌ వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. 
 
ఇటీవల వైఎస్సార్‌ జయంతి సందర్భంగా విడుదల చేసిన యాత్ర టీజర్‌ ఆకట్టుకుంది. వైఎస్‌ బయోపిక్‌ గురించి రాఘవ్‌ ప్రకటించినప్పుడే సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఎవరెవరు ఎవరి పాత్రల్లో నటిస్తున్నారనే దానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. 
 
ఇప్పటికే ఈ సినిమాలో వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నారని తెలిసింది. ఇక వైఎస్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్‌ పాత్ర గురించి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కార్తి జగన్‌ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదలవుతోంది. కార్తికి ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి స్టార్‌డం ఉంది. అందుకే జగన్‌ పాత్రకు ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments