Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీనాను రెండుసార్లు ప్రపోజ్ చేస్తే.. కోపంతో మూతి తిప్పుకుంది : సైఫ్

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో ఐదారేళ్ల పాటు గాఢమైన ప్రేమాయణం నడిపింది కరీనా కపూర్. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడమే తర్వాయి అనుకుంటుండగా.. కరీనా అతడికి టాటా బైబై చెప్పేసింది. తాను చిన్న పిల్లగా ఉన్న స

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (15:46 IST)
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో ఐదారేళ్ల పాటు గాఢమైన ప్రేమాయణం నడిపింది కరీనా కపూర్. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడమే తర్వాయి అనుకుంటుండగా.. కరీనా అతడికి టాటా బైబై చెప్పేసింది. తాను చిన్న పిల్లగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఈడొచ్చిన పిల్లలు కూడా ఉన్న సైఫ్ అలీఖాన్‌తో కరీనా ప్రేమలో పడటం.. తర్వాత అతణ్ని పెళ్లి కూడా చేసుకోవడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది. 
 
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైఫ్‌ను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది కరీనా. తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడు కాబట్టే సైఫ్‌ను పెళ్లాడానని కరీనా చెప్పింది. తాను లైఫ్ లాంగ్ సినిమాల్లో కొనసాగుతానని.. ఆ విషయంలో సపోర్ట్‌గా నిలవాలని తాను సైఫ్‌కు కండిషన్ పెట్టానని.. అతను ఓకే అన్నాకే పెళ్లి చేసుకున్నానని కరీనా వెల్లడించింది. 
 
అంతేకాదు ఈ భామ సైఫ్‌తో పెళ్లికి రెండుసార్లు నిరాకరించినట్లు తెలిపింది. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం సైఫ్‌, కరీనాలు పారిస్‌ వెళ్లగా.. అక్కడ రిట్జ్‌ హోటల్‌ వద్ద ఓసారి సైఫ్‌ ప్రపోజ్‌ చేయగా తాను నిరాకరించినట్లు చెప్పింది. అదేరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి నోత్ర్‌ దాం చర్చికి వెళ్లిన సమయంలో మళ్లీ సైఫ్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా కోపంతో ఈ విషయం గురించి అసలు మాట్లాడకు అన్నానని వివరించింది. 
 
అప్పుడు కరీనా అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అప్పుడే పెళ్లంటే కెరీర్‌పై దృష్టిపెట్టలేనని, ఆలోచించుకోవడానికి కొంతసమయం కావాలని అడిగి.. రెండు రోజుల తర్వాత సైఫ్‌ వద్దకు వచ్చి పెళ్లిచేసుకుందాం అని అడిగేసినట్లు చెప్పింది. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments