నేను కోరుకున్నది జరగదు.. అందుకే పెళ్లి పెటాకులైంది.. కంగనా రనౌత్ హ్యాపీ

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. తాను కావాలనుకున్నది ఏదీ దొరకదని.. అది కాస్త చెడే జరిగితీరుతుందని కంగనా తెలిపింది. తాను పెళ్లి చేసుకోవాలని చాలాసార్ల

Webdunia
బుధవారం, 4 జులై 2018 (10:33 IST)
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. తాను కావాలనుకున్నది ఏదీ దొరకదని.. అది కాస్త చెడే జరిగితీరుతుందని కంగనా తెలిపింది. తాను పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నానని, కానీ అది జరగకపోవడం సంతోషంగా ఉందని చెప్పింది. తన ప్రేమ విఫలమైన తర్వాత దేవుడే తనను కాపాడాడని అనుకున్నానని తెలిపింది. 
 
తాను ఏది కావాలనుకున్నా.. అందుకు తాను అనర్హురాలినని.. చాలామంది తక్కువ అంచనా వేశారని చెప్పింది. తనకు కావాలనుకున్నప్పుడు దక్కకపోతే పోరాడానని.. కన్నీళ్లు పెట్టుకున్నానని కంగనా తెలిపింది. అందుకే తాను దేవుడిపై భారం వేశానని తెలిపింది. ఆ భగవంతుడు తాను ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా తన పట్ల చాలా దయతో వ్యవహరించాడని చెప్పింది. 
 
మోడలింగ్‌ చేసి, తన తల్లిదండ్రుల దగ్గర తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నానని, కానీ మోడలింగ్‌ ప్రపంచం తనను తిరస్కరించిందని కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను కోరుకున్న చాలా విషయాల్లో ఇలాగే జరిగిందని కంగనా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments