Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకి పబ్లిసిటీ పిచ్చి... కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ : కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులతో మూడు రోజుల పాటు ఫోటోలు దిగిన విషయం తెల్సిం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (14:04 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులతో మూడు రోజుల పాటు ఫోటోలు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆయన రజకీయ రంగ ప్రవేశం చేసేందుకే ఇలా చేశారంటూ వార్తలు గప్పుమన్నాయి. 
 
ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందిస్తూ రజనీకాంత్ కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ అన్నారు. అందుకే ఇలా హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ ప్రత్యక్ష మవుతారన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపుతున్నాయి.
 
నిజానికి తమిళ సినీ ఇండస్ట్రీకి వీరిద్దరు రెండు నేత్రాలుగా ఉన్నారు. పైగా, ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులుగానూ, స్టార్ హీరోలుగా పేరుతెచ్చుకున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా ప్రత్యక్ష విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా రజనీపై కమల సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది. 
 
ఇదిలావుండగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా రజనీకాంత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రాన్ని తమిళుడే పాలించాలంటూ వ్యాఖ్యానించారు. అంటే రజనీకాంత్ తమిళుడు కాదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments