Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కి 2898 AD.. నీటి అడుగున రొమాంటిక్ సాంగ్ విడుదల

సెల్వి
గురువారం, 6 జూన్ 2024 (19:37 IST)
డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం, కల్కి 2898 AD. తాజాగా సూపర్ స్టార్ ప్రభాస్, దిశా పటాని నటిస్తున్న ఈ సినిమాలో ఓ రొమాంటిక్ పాట షూట్ చేస్తున్నారు. నీటి అడుగున ఈ రొమాంటిక్ పాటను షూట్ చేస్తున్నారని త్వరలో ఈ పాటను విడుదల చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ పాటను ఇటీవల యూరప్‌లో చిత్రీకరించారు.ఇది రాబోయే రెండు వారాల్లో విడుదల కానుంది. సముద్రపు ట్రెంచ్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలోని నీటి అడుగున సన్నివేశాలు విజువల్‌గా అద్భుతంగా ఉంటాయి.
 
విజువల్స్ నీటి అడుగున గల అందమైన ప్రపంచాన్ని చూపెడుతుంది. ఇది కళ్ళకు ట్రీట్ అవుతుంది. చిత్ర దర్శకుడు, నాగ్ అశ్విన్, విజువల్స్ ఉత్కంఠభరితంగా ఉంటాయని హామీ ఇచ్చారు.
 
అంతకుముందు, దిశా పటానీ పాట చిత్రీకరించిన ఫారిన్ లొకేషన్ నుండి చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. కల్కి 2898 ADలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో సహా అగ్ర సినీ నటులు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ దశలో వుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత  సముద్రపు నీటి అడుగున రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments