Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' కంటే 'బిచ్చగాడు' మంచి చిత్రం.. ఆ గ్రాఫిక్స్‌ను మా రోజుల్లో ట్రిక్స్ అనేవాళ్లం : కైకాల కామెంట్స్

ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడుడిగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రమ్యకృష్ణ, నాజర్ వంటివారు ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ చిత్రం తొలి భాగం గత 2015లో విడుదలై

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:26 IST)
ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రమ్యకృష్ణ, నాజర్ వంటివారు ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ చిత్రం తొలి భాగం గత 2015లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం రెండో భాగం "బాహుబలి 2 ది కంక్లూజన్" వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులంతా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ బాహుబలి చిత్ర నిర్మాణం, కథ, గ్రాఫిక్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ‘బాహుబలి’ సినిమాలో ఏముంది అని నిలదీశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘బాహుబలి’ గురించి మాట్లాడారు. 
 
"నేను బాహుబలి సినిమా చూశాను. ఏముంది అందులో. కథగా చెప్పుకోవడానికి అసలేముంది. ఆ సినిమా గురించి చాలా సింపుల్‌గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చు. భారీ సెట్లు, గ్రాఫిక్స్‌ మాత్రం ఉన్నాయి. మా రోజుల్లో వాటిని ‘ట్రిక్స్‌’ అనే వాళ్లం. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి ‘గ్రాఫిక్స్‌’ అంటున్నారు. మన మార్కెట్‌కు రూ.500 కోట్లు పెట్టాల్సిన అవసరముందా?. ఆ బడ్జెట్‌తో 500 చిత్రాలు చేసుకోవచ్చు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్‌ వాళ్లు ఎప్పుడో తీశారు. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్‌ సినిమాల్లో చూశాం. బోలెడు ఖర్చుపెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా? మొన్న ‘బిచ్చగాడు’ అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్లు జిగేల్‌మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా" అని సత్యనారాయణ ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments