Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకేంద్రుడి దర్శకత్వంలో యంగ్ టైగర్.. ఫిల్మ్ నగర్‌లో ముమ్మర చర్చ

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని.. అది కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నాడని.. మహా భారతంలోని ఓ ఘట్టంతో పౌరాణిక చిత్రం గానీ.. లేదా సోషియో ఫాంట

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (16:54 IST)
ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని.. అది కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నాడని.. మహా భారతంలోని ఓ ఘట్టంతో పౌరాణిక చిత్రం గానీ.. లేదా సోషియో ఫాంటసీ చిత్రాన్ని గానీ తెరకెక్కించబోతున్నాడంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ప్రస్తుతం దర్శకేంద్రుడు నాగార్జున‌తో ''ఓం న‌మో వేంక‌టేశాయ'' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున శ్రీవారి భక్తుడు హాథిరామ్ బాబాగా కనిపించనున్నాడు. ఈ భక్తిరస చిత్రం తర్వాత దర్శకేంద్రుడు తారక్‌తో సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. 
 
ఇదిలావుంటే ''జనతా గ్యారేజ్'' సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేయలేదు. అయితే, తాజాగా రాఘవేంద్ర రావు ఎన్టీఆర్‌తో కథా చర్చలు కూడా మొదలెట్టారనే ప్రచారం టాలీవుడ్‌లో మొదలైంది. 
 
రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ సినిమా చేయాలనుకున్నది నిజమేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమాను కూడా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments