Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య కెరీర్‌లో సోషల్ మీడియా రికార్డు: బాబాయ్‌ వల్లే అది సాధ్యమన్న ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చూసిన బాలయ్య అభిమానులు ఇప్పటికే ఖుషీగా ఉన్నారు. చా

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (16:38 IST)
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చూసిన బాలయ్య అభిమానులు ఇప్పటికే ఖుషీగా ఉన్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా కథానాయిక పాత్ర పోషిస్తోంది. అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. 
 
డిఫరెంట్ లుక్‌తో బాలయ్య కనిపించిన తీరు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ అయితేనే ఇలాంటి పాత్రలు చేయగలడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు. దశరానాడు విడుదలైన ఈ టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించింది.
 
సినిమా చారిత్రక నేపథ్యం కలిగి ఉండడంతో పాటు, మూవీలో బాలయ్య గెటప్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీతో చాలామంది టీజర్‌ను చూశారు. బాలయ్య కెరీర్లోనే ఇదొక సోషల్ మీడియా రికార్డు. శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు ప‌లువురు సినిమా ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక యూట్యూబ్‌లో సైతం బాల‌య్య గ‌త సినిమాల‌కు రాని విధంగా వ్యూస్ వ‌స్తుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన అబ్బాయ్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయాడ‌ట‌. ఇలాంటి పాత్ర‌లు చేయాలంటే కేవ‌లం బాబాయ్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని… ఈ సినిమా కోసం తాను ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాన‌ని త‌న స‌న్నిహితుల‌తో అన్నాడ‌ట‌. శాత‌క‌ర్ణి టీజ‌ర్‌ను ఎన్టీఆర్ మెచ్చుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. శాత‌క‌ర్ణి సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments