Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌య‌మ్మ‌కు కోపం వ‌చ్చింది!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (22:46 IST)
Varalaxmi ph
క్రాక్ సినిమాలో జ‌య‌మ్మ‌గా న‌టించిన వరలక్ష్మీ శరతకుమార్ ఆ త‌ర్వాత నాంది సినిమాలో లాయ‌ర్‌గా మంచి పాత్ర పోషించింది. నాంది సినిమా స‌క్సెస్‌టూర్ కూడా తెలుగు రాష్‌ట్రాల‌లో ప‌ర్య‌టించింది. ఇదే టైంలో చెన్నైలోని త‌న బంధువుల ఇంటికి ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌రైంది. మ‌రి ఇక్క‌డ‌లా అక్క‌డ మీడియా వుండ‌దు క‌దా. వెంట‌నే అక్క‌డ వున్న ఓ విలేక‌రి మీరుకూడా పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నార‌ని అడిగాడు. దాంతో ఒక్క‌సారిగా చిర్రెత్తుకొచ్చిన జయ‌మ్మ కోపంతో ‘సినిమా వాళ్లకు కూడా వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వాటి గురించి నలుగురిలో చ‌ర్చించ‌డం సబబు కాదు. నన్నే కాదు ఇంకే సినిమా సెలబ్రిటినీ వ్యక్తిగత విషయాలు అడగొద్దు’’ అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో ఆశ్చ‌ర్య‌ప‌డినా వెంట‌నే తేరుకున్న విలేక‌రి మేరేజ్ ఫంక్ష‌న్‌క‌దా మేడ‌మ్ అందుకే అడిగానంటూ స‌మాధాన‌మిచ్చాడు. ఇలాంటివి హీరోయిన్ల‌కు ఎదురు కావ‌డం మామూలే. మిగిలిన హీరోయిన్లు అయితే జ‌రిగిన‌ప్పుడు మీకే చెబుతానంటూ స‌మాధానం ఇచ్చేవారు. మ‌రి జ‌య‌మ్మ అలా కోపగించిందంటే ఏదో వుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments