Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. జాగ్వార్‌కు బాగా డబ్బు కుమ్మరించారా? విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌కే.. రూ.75లక్షలు..

కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ తొలిసారి నటిస్తున్న సినిమా జాగ్వార్. ఈ సినిమాకు దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు చేశారు యూనిట్ సభ్యులు. అంతేకాకుండా ఈ సినిమాకి భయంకరమైన ప్రమోషన్ చే

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:12 IST)
కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ తొలిసారి నటిస్తున్న సినిమా జాగ్వార్. ఈ సినిమాకు దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు చేశారు యూనిట్ సభ్యులు. అంతేకాకుండా ఈ సినిమాకి భయంకరమైన ప్రమోషన్ చేస్తున్నారు. ప్రకటనలు కుమ్మేస్తున్నారు. ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే ఖరీదైన డెబ్యూ సినిమాగా రికార్డుల‌కు ఎక్క‌నుంది. హాలీవుడ్ తరహాలో ఉండేలా ఈ మూవీని రూపొందిస్తున్నారట.
 
దర్శకుడు మహదేవ్ ప్రతి ఫ్రేమును చాలా అందంగా తెరకెక్కించారని సినీ వర్గాలు అంటున్నాయి. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో దీప్తి సతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా రెమ్యున‌రేష‌న్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. జగపతి బాబు పారితోషికం 50 లక్షలు, విజయేంద్ర ప్రసాద్ కథ కోసమే రూ. 75 లక్షలు ఇచ్చారట. 
 
ఇక హీరోయిన్‌కు కూడా రూ.2 కోట్లు ముట్టజెప్పార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే హీరోకు రెమ్యున‌రేష‌న్ లేదు. కాగా ఈ సినిమా పబ్లిసిటీ కోసం రూ. 7 కోట్ల బడ్జెట్ కేటాయించారట. గత ఆదివారం జరిగిన ఆడియో వేడుక భారీ ఎత్తున సాగింది. ఓ స్టార్ హీరో స్థాయిలో ఆ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ''రేసుగుర్రం'', ''బ్రూస్‌లీ'' వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసిన మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ పొటోగ్రఫిగా వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలుస్తుందని సినీ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments