Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'కత్తిలాంటోడు'లో విలన్‌గా జగపతిబాబు

Webdunia
మంగళవారం, 17 మే 2016 (14:36 IST)
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150వ చిత్రం  ఇటీవ‌లే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ 'క‌త్తి' సినిమాను తెలుగులో 'క‌త్తిలాంటోడు' పేరుతో రీమేక్ చేస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ సినిమా కోసం అనుష్కను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 
 
ఇప్పుడు ఈ సినిమా కోసం చిరు టీం ఓ రేంజ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ సినిమాలో చిరుతో సమానమైన విల‌న్ కోసం అన్వేష‌ణను జరుపుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మగువల హృదయాల్ని కొల్లగొట్టి ఇప్పుడు విలన్‌గా కూడా సత్తా చాటుతున్న జగపతి బాబు, చిరంజీవి 150వ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజండ్' చిత్రంలో జగ్గుబాయ్ విలన్‌గా నటించి మంచి పేరుతో పాటు.. మార్కులు కొట్టేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో విలన్‌గా నటించి తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు చిరు 150వ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం జగపతిబాబును వెతుక్కుంటూ వచ్చింది. 
 
ఈ సినిమాలోని విలన్ పాత్రకు జగపతిబాబు అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడని భావించిన వినాయక్, ఇదే విషయాన్ని చిరుకి చెప్పారట. దీంతో మారుమాట మాట్లాడకుండా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. నందమూరి హీరోలతో వరుసగా విలన్‌గా నటించిన జగపతిబాబు ఇప్పుడు మెగాహీరోతో నటించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా జగపతిబాబు రేంజ్‌ని ఇంకెంత పెంచుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments