Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పదంగా మారిన ప్రియాంకా చోప్రా టీ షర్ట్ ఇమేజ్...

ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ''బేవాచ్‌''లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అమెరికా టీవీ ధారావాహిక ''క్వాంటికో'' ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాందించుకున్న ఈ అమ్మడు హాలీవుడ్ వర్గాల్లో పాపులర్ అయింది. ఇటీవల

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (11:25 IST)
ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ''బేవాచ్‌''లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అమెరికా టీవీ ధారావాహిక ''క్వాంటికో'' ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాందించుకున్న ఈ అమ్మడు హాలీవుడ్ వర్గాల్లో పాపులర్ అయింది. ఇటీవల ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది ప్రియాంక చోప్రా. ఇదిలావుంటే ఈ బ్యూటీ వివాదంలో ఇరుక్కుంది. ట్రావెలర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ అమ్మడు వేసుకున్న టీషర్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. 
 
ఆ కవర్ పేజ్ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిందీ భామ. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. జనాలకు అంత కోపం తెప్పించే విధంగా ఆ టీషర్ట్ పై ఏముందో తెలుసా... తెల్లటి టీషర్ట్ పై... రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్‌లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది.
 
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. బతకడం అసాధ్యమైన సందర్భంలో ప్రతిరోజు శరణార్థులుగా, వలసవాదులుగా ఇతరదేశాలకు తరలిపోతున్న వారిని కించపరిచేలా ఈ రాతలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు విసురుతున్నారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటి (క్వాంటికో టీవీ సీరియల్)కి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణం వల్లే జాత్యహంకార ధోరణితో, మూర్ఖంగా ఉన్న రాతలతో కూడిన టీషర్‌‌ను ప్రియాంక ధరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments