గేమ్ ఛేంజర్ నష్టాలను రామ్ చరణ్ రికవరీ చేస్తున్నాడా?

డీవీ
బుధవారం, 29 జనవరి 2025 (15:24 IST)
Ram charan- Dil Raju
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అందుకే నిర్మాత దిల్ రాజు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దానికి కాస్త ఊరటగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామ్ నిలిచింది. కాబట్టి, 'గేమ్ ఛేంజర్' నుండి వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తన కోసం ఒక సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుతో చెప్పినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
 
తాజాగా ఈ వార్తను రామ్ చరణ్ టీమ్ ఖండిస్తూ, అది అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుతానికి ఆ అవసరంలేదని తెలుపుతూ, రామ్ చరణ్ ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు సనాతో కలిసి షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కోసం పని చేస్తున్నాడు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమాకి సంతకం చేశాడని, మరే సినిమాకు కమిట్ అవ్వలేదని చిత్రబృందం తెలిపింది.
 
బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేలు కూడా వెలువరించింది. తాజా షెడ్యూల్ బుధవారం నుంచి జరగనుంది. టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు, వర్కింగ్ టైటిల్ గా RC16 అని షూటింగ్ లో పిలుస్తూ క్లాప్ కొడుతున్నారు. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారని కూడా తెలిసింది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments