Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్ నిజమేనా? లేక గాసిప్పా?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (19:15 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి అరవింద సమేత అనే సినిమా చేయడం.. ఆ సినిమా సక్సస్ సాధించడం తెలిసిందే. దీంతో మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని వార్త రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. ఎనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా యాక్షన్ మూవీనా? ఫ్యాక్షన్ మూవీనా? పొలిటికల్ మూవీనా? అనే చర్చ మొదలైంది. అరవింద సమేత సీరియస్ ఫిల్మ్ కాబట్టి ఇది ఫ్యామిలీ మూవీ అని కొంతమంది అంటే.. కాదు ఇది పొలిటికల్ మూవీని కొంతమంది అన్నారు.
 
అందుకనే అయిననూ పోయారావలే హస్తినకు అనే టైటిల్‌ ఖరారు చేసారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ బడా బిజినెస్ మేన్‌గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అందుకు తగినట్టుగానే ఎన్టీఆర్ లుక్ ఉంటుందని అంటున్నారు. 
 
ఈ పాత్రను త్రివిక్రమ్ చాలా స్టైలీష్‌గా తీర్చిదిద్దాడని... ఎన్టీఆర్ బాడీ లాగ్వేజ్ ఒక రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా..? లేక గాసిప్పా అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం ఇది నిజమే అంటున్నారు కానీ.. క్లారిటీ రావాల్సింది. ఏది ఏమైనా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

WhatsApp : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 సేవలను అందిస్తాం.. నారా లోకేష్

NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి

Dolphins : ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములకు డాల్ఫిన్ల శుభాకాంక్షలు.. వీడియో వైరల్ (video)

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments