Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

దేవీ
మంగళవారం, 8 జులై 2025 (11:32 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది. ఇప్పటివరకు సాంగ్స్ పూర్తయ్యాయి. ఆమధ్య రాముడిపై ఓ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. మరో పాటను తీయనున్నారని చిత్ర యూనిట్ చెప్పింది. దీనికి బాలీవుడ్ కథానాయిక నర్తించనుందని తెలిసింది. కాగా, చిరంజీవి ఈసారి అభిమానులను అలరించేవిధంగా ఓ పాటను సెలక్ట్ చేసుకున్నారని సమాచారం. 
 
చిరంజీవి గతంలో  చేసిన పాటను రీమిక్స్ గా విశ్వంభరలో తేనున్నారట. గతంలో తాను నటించిన అన్నయ్య చిత్రంలో ఆటకావాలా.. పాట కావాలా.. అనే సాంగ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన పాటనే రీమిక్స్ చేయడం అందరికీ హుషారెత్తించేలా వుందని చెబుతున్నారు. దీనికి సంగీత దర్శకుడు భీమ్స్ చేత రీమిక్స్ పనులు జరుగుతున్నాయట. త్వరలో సెట్ పైకి తేనున్నారని సమాచారం. ఇదే కనుక కుదిరితే చిరంజీవి అభిమానులకు పండుగే పండుగ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments