Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే.. దర్శకుడి మొహం మీదకే విసిరికొడతా: అమీ జాక్సన్

అమీ జాక్సన్. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 హీరోయిన్. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ రోబో సీక్వెల్‌లో అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకాడట్లేదు. అయితే

Webdunia
గురువారం, 27 జులై 2017 (13:17 IST)
అమీ జాక్సన్. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 హీరోయిన్. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ రోబో సీక్వెల్‌లో అందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకాడట్లేదు. అయితే గ్లామర్ పరంగా హద్దులు మీరేందుకు వెనుకాడని ఈ విదేశీ రాణి.. బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే మాత్రం.. దర్శకుడి మొహం మీదకే విసిరికొడతానని తెలిపింది. దీంతో తాప్సీకి వంతపాడినట్లైంది. 
 
ఝమ్మందినాదం సినిమాలోని ఓ పాటలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. తన బొడ్డుపై పండ్లు, కొబ్బరికాయ వేయించారని.. అందులో రొమాన్స్ ఏముందో తనకు అర్థం కాలేదని తాప్సీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాప్సీ ఇటీవలే సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ అమీ జాక్సన్ అదే టాపిక్‌పై ప్రస్తావించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. 
 
ఓ ఇంటర్వ్యూలో అమీ జాక్సన్ మాట్లాడుతూ.. మీ బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే ఏం చేస్తారనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇప్పటివరకు తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, ఇప్పటిదాకా మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశానని అమీ తెలిపింది. బొడ్డుపై కొబ్బరికాయలు విసరడం భయంకరంగా ఉంటుందని.. ఏ దర్శకుడైనా తన బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే.. తిరిగి వారి మొహం మీదకే విసిరికొడతానని కామెంట్ చేసి షాకిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments