Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మసాలా' చిత్రాల్లో నటిస్తుంటే ఆ మజానే వేరప్పా అంటున్న బాలీవుడ్ నటి!

మంచి చిత్రాల్లో, మంచి పాత్రల్లో నటించి.. పదికాలాల పాటు గుర్తుండిపోయే నటిగా ఉండాలని ప్రతి నటి కోరుకుంటారు. కానీ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చెపుతోంది. మసాలా చ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:38 IST)
మంచి చిత్రాల్లో, మంచి పాత్రల్లో నటించి.. పదికాలాల పాటు గుర్తుండిపోయే నటిగా ఉండాలని ప్రతి నటి కోరుకుంటారు. కానీ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చెపుతోంది. మసాలా చిత్రాల్లో నటించడమే తనకు మజాగా ఉంటుందని చెపుతోంది. ఆ నటి ఎవరో కాదు.. ప్రియాంకా చోప్రా. 
 
తాను నటించిన తొలి హాలీవుడ్‌ సినిమా ‘బేవాచ్’. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు దీపికా పడుకోనే నటించిన తొలి హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమా వచ్చింది కానీ, భారత్‌లో సరిగా ఆడలేదు. 
 
దీనిపై ప్రియాంకా చోప్రా స్పందిస్తూ... 'మరొకరి కెరీర్‌ మీద ఆధారపడి నా కెరీర్‌ ఎప్పుడూ నడవలేదు. నా కెరీర్‌ నా మీదే ఆధారపడి నడుస్తుంది. ఒకరి సినిమా ఆడితేనో, ఆడకపోతేనో.. నాకేం సంబంధం? ‘జై గంగాజల్‌’ (హిందీ చిత్రం) తర్వాత నేను చేసిన సినిమా కావడంతో ‘బేవాచ్’పై భారత్లో అంచనాలు బాగానే ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది.
 
కాగా, 1990లలో వచ్చిన ‘బేవాచ్’ టెలివిజన్ సిరీస్‌ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక కాకుండా డ్వేన్ జాన్సన్ (ద రాక్‌), జక్‌ ఎఫ్రాన్, అలెగ్జాండ్రా దడ్డారియో ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో విక్టోరియా లీడ్స్‌ అనే విలన్ కేరక్టర్‌లో ప్రియాంక కనిపించనున్నది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments