Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సినిమా కోసం దేవిశ్రీకి భారీ రెమ్యూనరేషన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:39 IST)
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్... టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరు. దేవిశ్రీ మ్యూజిక్ అంటే.... ఆ సినిమా హిట్టే అనే టాక్ ఉంది. అంతేకాకుండా రీ-రికార్డింగ్ అదరగొట్టేస్తాడు. ఇక ఆడియో ఫంక్షన్లో దేవిశ్రీ చేసే హంగామా అంతాఇంతా కాదు. అయితే... ఇటీవల కాలంలో దేవిశ్రీ కాస్త వెనకబడ్డాడు. తమన్ దూసుకుంటూ వెళుతున్నాడు.
 
ఇదిలా ఉంటే... దేవిశ్రీ పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఏ సినిమాకి అంటారా..? పవన్‌తో హరీష్‌ శంకర్ చేస్తున్న సినిమాకి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 
 
పవన్‌కి దేవిశ్రీ సంగీతం అందించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల్లోని పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు పవన్ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తుండడంతో ఖచ్చితంగా సాంగ్స్ అదరగొట్టేస్తాయ్ అంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే...ఈ సినిమాకి దేవిశ్రీ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలిసింది. ఇంతకీ అంటారా...? సుమారు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గతంలో దేవిశ్రీ పారితోషకంగా ఒకటిన్నర కోటి తీసుకునేవారట.
 
 ఇప్పుడు పవన్ సినిమాకు మాత్రం రెండు కోట్లు తీసుకుంటున్నారని తెలిసింది. తమన్ దూసుకెళుతున్న టైమ్‌లో కూడా దేవిశ్రీ భారీ రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం. ఈ సినిమాతో దేవిశ్రీ మరింతగా బిజీ అవుతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments