ఆ నటితో కంటే పోప్‌తో ఎఫైర్ పెట్టుకుంటానంటున్న బాలీవుడ్ హీరో!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. వీరిద్దరి మధ్య అదేదో ఎఫైర్ ఉన్నట్టు లోగడ అనేక కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ బద్దశత్రువులుగా మారిపోయారు. పైపెచ్చు... వీరిద్దరు మధ్య పచ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (11:42 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. వీరిద్దరి మధ్య అదేదో ఎఫైర్ ఉన్నట్టు లోగడ అనేక కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ బద్దశత్రువులుగా మారిపోయారు. పైపెచ్చు... వీరిద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోంది. 
 
ఈనేపథ్యంలో టీవీలో వ‌స్తున్న ఓ కార్య‌క్ర‌మం ప్రోమోలో పేరు చెప్ప‌కుండా ఓ హీరో త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన‌డం బాలీవుడ్‌లో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప్రోమోలో కంగ‌నా ఏమ‌న్నదంటే....`అత‌న్ని ఇక్క‌డికి పిల‌వండి. ప్ర‌తి ప్ర‌శ్న‌ను అత‌న్ని అడ‌గండి. మొద‌ట నోటీసు పంపింది నేను కాదు. అంత నీతిమాలిన ప‌ని నేను చేయ‌లేదు. 
 
ఆ నోటీసు వ‌ల్ల రాత్రిళ్లు నాకు నిద్ర‌ప‌ట్టేది కాదు. ఒత్తిడి, మాన‌సిక వేద‌న వ‌ల్ల ఎంతో న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాను. నా పేరు మీద అతను మెయిల్స్ కూడా విడుద‌ల చేశాడు. ఇప్ప‌టికీ వాటిని గూగుల్ చేసి మ‌రీ జ‌నాలు చ‌దివి, నా మీద జోకులు వేస్తున్నారు. న‌న్ను ఇంత‌ ఇబ్బందికి గురి చేసినందుకు అత‌ను నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి` అంటూ డిమాండ్ చేసింది. 
 
ఇంతలోనే ఆ మాట‌లు హృతిక్‌ని ఉద్దేశించి అన్న‌వేన‌ని మీడియా అనుకునేలోపే బాలీవుడ్ హీరో ఓ ట్వీట్ చేసి అగ్నికి ఆజ్యం పోశాడు. "మీడియా చెబుతున్న మ‌హిళ‌తో కంటే పోప్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డానికి నేను సిద్ధంగా ఉంటాను" అంటూ హృతిక్ ట్వీట్ చేయ‌డంతో ఆ మాట‌లు అత‌న్ని ఉద్దేశించి అన్న‌వేన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్ల‌యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

పోలీసులు వచ్చారని నదిలోకి దూకేసిన పేకాటరాయుళ్లు.. ఒక వ్యక్తి మాత్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments