Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ను పక్కనపెట్టి మరొకరితో అనుష్కకు పెళ్లా.. అదీ నాగ్ కుదిర్చిన వ్యక్తితోనా.. అయ్యో....

తన పన్నెండేళ్ల సినీ జీవిత వైభవానికి పరాకాష్టగా బాహుబలి-2 సినిమాతో అందానికి, అభినయానికి ఉన్న నిర్వచనాన్ని అనుష్క పరాకాష్టకు తీసుకెళ్లిపోయింది. అనుష్క. తెలుగు చలన చిత్ర చరిత్రలో అనుష్క-ప్రభాస్‌ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ మరెవ్వరికీ సాధ్యం కాదని ప్రేక్షకు

Webdunia
శనివారం, 20 మే 2017 (06:16 IST)
దాదాపు పుష్కర కాలంగా తెలుగుతెరపై జేజెమ్మగా వెలిగిపోతున్న నటి అనుష్కకు ఇప్పుడు 36 ఏళ్ల వయస్సు. 2005లో సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క కెరీర్ అరుంధతి సినిమాతో వెనుదిరిగి చూసుకోవలసిన ఆవసరం లేకుండా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోయింది. తన పన్నెండేళ్ల సినీ జీవిత వైభవానికి పరాకాష్టగా బాహుబలి-2 సినిమాతో అందానికి, అభినయానికి ఉన్న నిర్వచనాన్ని అనుష్క పరాకాష్టకు తీసుకెళ్లిపోయింది. అనుష్క. తెలుగు చలన చిత్ర చరిత్రలో అనుష్క-ప్రభాస్‌ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ మరెవ్వరికీ సాధ్యం కాదని ప్రేక్షకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఇప్పుడు బాహుబలి ప్రభంజన ఏస్తాయిలో ఉందో అంతకుమించిన ప్రచారం అనుష్క పెళ్లి వ్యవహారంపై సాగుతోంది. వాళ్లద్దరు ఒక జంట అయితే  ఎంత బాగుండు అనేది ఇప్పుడు జనం నాలికలపై మంత్రంలా సాగుతోంది.
 
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పూర్తి చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ కావడం ఖాయమని వార్తలు సూచిస్తున్నాయి. అనుష్క పెళ్లిపై ఇటీవల చాలా పుకార్లు చెలరేగుతున్నాయి. అనుష్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతోందని కొందరు అంటే, కాదు అమ్మా నాన్నా ఎంపిక చేసిన అబ్బాయినే చేసుకుంటుందని కొందరంటున్నారు. అయితే తాజాగా అనుష్క పెళ్లిపై వస్తున్న వార్త ఫిలింనగర్‌లో చర్చలకు తెరలేపింది. 
 
టాలీవుడ్‌లో నాగార్జునతో అనుష్కకు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో నాగచైతన్యకి, అఖిల్‌కి యోగ నేర్పించింది అనుష్క. నాగార్జున ఇటీవల నటించిన సినిమాల్లో ఏదో ఒక పాత్రలో స్వీటీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిలేషనే అనుష్క పెళ్లికి బాటలు పరిచిందన్న వార్తలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. నాగార్జునకు బాగా సన్నిహితుడైన వ్యాపారవేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనుష్క గురించి, ఆ వ్యాపార వేత్త గురించి బాగా తెలిసిన నాగార్జునే ఈ పెళ్లిని సెట్ చేశాడనే వార్త కూడా బలంగా వినిపిస్తోంది. అయితే అనుష్క పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లలో ఒకటిగా ఈ పుకారు కూడా నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది. ఎవరో ఒకరు స్పందిస్తే కానీ ఈ విషయం నిర్ధారణ కాదు..
 
ఈ వార్త నిజంకాకపోతే ఎంత బావుణ్ణు దేవుడా.. అన్నది ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్-అనుష్క బంధం సినిమాల్లోనే కాకుండా, జీవితంలోనూ శాశ్వతమే అనుకుంటున్న కో్ట్లమంది ఆకాంక్షలపై ఇంత చేదు వార్త వస్తే ఎలా... ఊహకు కూడా సాధ్యం కాకుండా ఉంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments