Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపాసా లేకుంటే రాత్రిళ్లు నిద్రపట్టదు : కరణ్‌సింగ్ గ్రోవర్‌

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు ఇటీవల కరణ్‌సింగ్ గ్రోవర్‌తో మూడు ముళ్ళు వేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలేవి ఈ అమ్మడి చేతిలో లేకపోవడంతో తన భర్తతో కలిసి టూర్లు వేస్తోంది. లైఫ్‌ని ఫుల్‌గా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (13:32 IST)
బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు ఇటీవల కరణ్‌సింగ్ గ్రోవర్‌తో మూడు ముళ్ళు వేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలేవి ఈ అమ్మడి చేతిలో లేకపోవడంతో తన భర్తతో కలిసి టూర్లు వేస్తోంది. లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఇక తన అభిమానులను సినిమాలతో అలరించకపోయిన, తాను ఎంజాయ్ చేస్తోన్న ప్లేస్‌లకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..వారిని ఉత్సాహపరుస్తోంది. 
 
పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మడు తన అందాలని ఆరబోస్తూనే ఉండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కొందరైతే పెళ్ళి తర్వాత బిపాసా చాలా అందంగా కనిపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే కరణ్‌సింగ్‌ గ్రోవర్‌ తనకు బిపాసాపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. తను లేకపోతే రాత్రిళ్లు నిద్రపట్టదని చెబుతున్నాడు. ''దంపతులు ఒకరికొకరు సర్‌ప్రైజ్‌లు ఇచ్చుకోవడం వల్ల వాళ్ల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రొమాన్స్‌ కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నా జీవిత భాగస్వామికి ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లు ఇవ్వాలని అనుకుంటా. 
 
నేను ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉంటే బిపాసా.. ప్రేమగా మాట్లాడి నాలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అందుకే బిపాసా లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. తను ఎప్పుడైనా బయటకు వెళ్తే అసలు నిద్రపట్టదు. కొన్ని సందర్భాల్లో బిపాసా నా మీద చికాకు పడటం.. కోప్పడటం లాంటివి చేస్తుంది. గర్ల్‌ఫ్రెండ్‌ మన మీద ఎంత అరిచినా కోపం రాదు. పైగా వాటిని పట్టించుకోం. అందుకే బిపాసాను ఇప్పటికీ భార్యగా కాకుండా గర్ల్‌ఫ్రెండ్‌గానే చూస్తున్నా. అందుకే ఆమె నామీద ఎంత అరిచినా పట్టించుకోను'' అని తన మనసులోని మాటను బయటపెట్టాడు కరణ్‌.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments