Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ సినిమా ఆగిపోయింది.. కార‌ణం ఏంటో తెలుసా?

యంగ్ హీరో రామ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్లో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల గ‌రుడ‌వేగ సినిమాతో విజ‌యం సాధించిన ప్ర‌వీణ్ స‌త్తారు రామ్‌తో చేయ‌నున్న సినిమాను ఏమాత్రం రాజీప‌డ‌కుండా భారీ స్థాయిలో తెర‌కెక్కించాలి అనుకున్నారు. భవ్య క్రి

Webdunia
గురువారం, 24 మే 2018 (21:23 IST)
యంగ్ హీరో రామ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్లో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల గ‌రుడ‌వేగ సినిమాతో విజ‌యం సాధించిన ప్ర‌వీణ్ స‌త్తారు రామ్‌తో చేయ‌నున్న సినిమాను ఏమాత్రం రాజీప‌డ‌కుండా భారీ స్థాయిలో తెర‌కెక్కించాలి అనుకున్నారు. భవ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన ఆనంద్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు.
 
దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్ అవుతుండ‌టంతో రామ్‌తో అంత బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ కాద‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డ నిర్మాత ఆనంద్ ప్ర‌సాద్ ఈ సినిమాకి అంత బ‌డ్జెట్ పెట్ట‌లేన‌న‌డంతో ఈ ప్రాజెక్ట్ కాస్త స్ర‌వంతి ర‌వి కిషోర్ ద‌గ్గ‌ర‌కి వెళ్లింది.
 
కథ మిలిటరీ బ్యాక్ డ్రాప్లో ఉండటం, వివిధ ఖరీదైన లొకేషన్లలో సినిమాను రూపొందించాల్సి ఉండటంతో బడ్జెట్ ఎక్కువగా కేటాయించాల్సి వచ్చిందట. అయితే చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్ కూడా అంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయట. దీంతో రామ్, ప్రవీణ్ సత్తారులు ఈ చిత్రాన్ని నిలిపివేసి కొంతకాలం తర్వాత వేరే కథపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారట. మరిప్పుడు ఈ భారీ బడ్జెట్ కథను సత్తారు వేరే పెద్ద హీరో దగ్గరకి తీసుకెళ్తారా లేకపోతే రామ్ కోసం కొత్త కథను సిద్ధం చేసుకుంటారా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments